- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వినూత్న రీతిలో నిరసన చేపట్టిన రైతులు...
దిశ, రామడుగు: నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి పంట పొలాలకు సాగునీరు తక్షణమే విడుదల చేయాలని చొప్పదండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రైతులతో కలిసి పొలంలో కూర్చొని వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రెండు నెలలుగా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా అధికార యంత్రాంగంలో చలనం లేదన్నారు. యాసంగి సాగు ప్రారంభానికి ముందే రిజర్వాయర్ గండి పూడ్చివేత పనులు చేపట్టాలని డిమాండ్ చేసినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదన్నారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో రిజర్వాయర్ కింద వందలాది ఎకరాల వరి పంట ఎండిపోతుందన్నారు. గంగధార మండలం కొండాయి పల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పొలాలను రైతులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ఇప్పటికే వేలాది రూపాయలు అప్పులు తీసుకొచ్చి రైతులు వరి పంట సాగు చేస్తే అధికారులు సకాలంలో సాగునీరు విడుదల చేయకపోవడంతో పంట ఎండిపోతుందన్నారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సాగునీరు విడుదల చేయాలని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో సాగునీరు విడుదల చేయకపోతే వందలాది మంది రైతులతో కలెక్టరేట్ ముట్టడిస్తాం... ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, కాంగ్రెస్ మండల కిసాన్ అధ్యక్షులు బూర్గు గంగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట కరుణాకర్, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, కోల ప్రభాకర్, పెద్దిల్లి రాజేశం గ్రామ రైతులు పాల్గొన్నారు.