- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Adi Srinivas : వన్ టైం సెటిల్మెంట్ కింద రైతు రుణమాఫీ..
దిశ, చందుర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి రోజున చేసిన రైతు రుణమాఫీ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి మండలంలోని కిష్టంపేట గ్రామంలో రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏకకాలంలో రుణమాఫీ అయ్యాయని, మళ్లీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి హయాంలో రుణమాఫీ జరిగిందని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు రుణమాఫీ పట్ల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక మోడల్ కాబోతుంది.
గతంలో గుజరాత్ మోడల్ అన్నారు, నేడు తెలంగాణ మోడల్ కాబోతుంది. ఒక రైతు 80,000 మరొక రైతు 75,000 రుణమాఫీ అయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రుణమాఫీ కింద సిరిసిల్ల జిల్లా పరిధిలో 23వేల మంది, వేములవాడ నియోజకవర్గ పరిధిలో 11 వేల పై చిలుకు మంది రైతులకు 136 కోట్లు మాఫీ చేశారు. ఆనాడు వరంగల్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తుక్కగుడా మహాసభలో సోనియా గాంధీ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ హామీ మేరకు రుణమాఫీ చేస్తారని, ఈ నెలాఖరులోగా లక్ష నుంచి 1,50,000 లోపు రుణమాఫీ చేస్తాయని, తదుపరి ఆగస్టులో 1,50,000 నుంచి 2 లక్షల్లో రుణమాఫీ చేస్తామన్నారు. గ్రామాల్లో ఊరేగింపుగా రైతువేదికల వద్దకు వెళ్లడం చూస్తుంటే దసరా రోజు జంబి గద్దెకు వెళ్లడం గుర్తుకు వస్తుందని, కొందరు రైతులు తమకు మాఫీ కాలేదు అంటున్నారు. వారికి కూడా మాఫీ అవుతుంది. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా రైతుకు భూమి ఉండి పాస్ పుస్తకం పై రుణమాఫీ పొందడమే అర్హతగా పరిగణిస్తాం.
మాఫీ కానీ పేర్లు, తప్పిపోయిన రైతులకు గ్రీవిన్స్ సెల్ ద్వారా అర్జీలు స్వీకరించి మాఫీ చేస్తాం అన్నారు. రైతుబంధును రైతు భరోసాగా మార్చి నిజమైన రైతులకు రైతు భరోసా అందజేస్తున్నాము. గతంలో రైతుబంధు పేరిట గుట్టలకు, చెట్లకు, వాగులకు , వంకలకు, అనర్హులకు రైతుబంధును కట్టబెట్టింది. రైతు సోదరులారా రైతు భరోసా కూడా పెట్టుబడి సహాయం కింద అందజేస్తాము. రేషన్ కార్డు నిబంధన కేవలం కుటుంబ గుర్తింపు కోసం మాత్రమే, రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆయన వెంట తాజా మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, జోగాపూర్ తాజా మాజీ ఎంపీటీసీ మేకల గణేష్ , బోజ్జ మల్లేశం, రైతులు పాల్గొన్నారు.