- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడి మృతదేహం వెలికితీత
దిశ, గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం రీజియన్ లోని అర్జీ-3 ఏఎల్ పీ లో జరిగిన గని ప్రమాదంతో కార్మికుల కుటుంబాలు చీకటి మయంగా మారాయి. సోమవారం ఏఎల్పీ గని లో 86వ లెవల్ వద్ద 8 మంది కార్మికులు పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా సైడ్ వాల్ క్షణాల్లో కూలి పోవడంతో అప్రమత్తం అయ్యేలోపే అక్కడే విధులు నిర్వహిస్తున్న 8మంది కార్మికులలో నలుగురు కార్మికులు బొగ్గు శిథిలాల కింద ఇరుక్కు పోయారు. 25 మీటర్ల ఎత్తు, మూడు మీటర్ల వెడ..ల్పుతో ఉన్న బొగ్గు ఒక్కసారిగా మూడు మీటర్ల ఎత్తుతో పై కప్పు కూలినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాద ఘటనలో ఆపరేటర్ జాడి వెంకటేశ్వర్లు, గాయపడిన వీరయ్య లు మృత్యుంజయులుగా బయటపడగా.. మిగతా కార్మికులు తోట శ్రీకాంత్, రవీందర్, చైతన్య తేజ, జయరాజ్ లు అందులోనే కురుకుపోయినట్లు తెలుస్తోంది. వీరి పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారినట్లు తెలుస్తుంది. నిన్నటి నుండి సింగరేణి సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. మంగళవారం ఉదయం బొగ్గు శిథిలాల కింద ఉన్న ఓ కార్మికుడిని బయటకు తీశారు. ఇంకా ఆ కార్మికుడు ఎవరు అనేది వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదం జరిగిన బొగ్గు గని వద్ద కార్మికుల కుటుంబాలు, కార్మికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏఎల్ పీ లో జరిగిన గని ప్రమాదంలో ఇంకా ఎంత మంది కార్మికులు ఇరుక్కున్నారు.. వారి పరిస్థితి ఏంటి అనేది అధికారులు ద్రువీకరించలేకపోతున్నారు.