పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : కలెక్టర్ ఆర్.వీ కర్ణన్

by Shiva |
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : కలెక్టర్ ఆర్.వీ కర్ణన్
X

దిశ, కరీంనగర్ టౌన్ : వాతావరణ సమతూల్యత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ కాలుష్య నివారణ ర్యాలీని కలెక్టరేట్ వద్ద జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుంచి గీతా భవన్ చౌరస్తా వరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ క్లాత్, డ్యూడ్ బ్యాగులను వాడాలని, సొంత స్టీల్ వాటర్ బాటిల్స్ క్యారీ చేసి తద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మించాలని ఆయన తెలిపారు. మన రోజువారి జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏ.ఈ.ఈ వీరేష్, ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామ కృష్ణ, అటవీశాఖ అధికారులు, విద్యార్థులు, ఎన్జీవోలు, పరిశ్రమాలు, హాస్పిటల్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed