మాల్కాపూర్ లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

by Sridhar Babu |
మాల్కాపూర్ లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
X

దిశ,పెద్దపల్లి : రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మల్కాపూర్ దగ్గర యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 ప్రకారం రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మల్కాపూర్లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను హైదరాబాద్ కు చెందిన యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ఈ కేంద్రంలో ఒక ఆపరేషన్ ధియేటర్, 50 కుక్కలను ఉంచడానికి అవసరమైన బోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి, వారం రోజుల పాటు ఈ సెంటర్ లోనే ఉంచుకొని తరువాత విడిచిపెట్టనున్నట్టు తెలిపారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో గుర్తించిన దాదాపు 4000 వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తయ్యేవరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు.

Advertisement

Next Story