- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ పేపర్ కు పిండ ప్రదానం
కొండ్రికర్ల గ్రామస్థుల వినూత్న నిరసన
దిశ, మెట్ పల్లి : మండల పరిధిలోని కొండ్రికర్ల గ్రామంలో గ్రామస్థులు ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ పేపర్ కు పిండ ప్రదానం చేశారు. గత ఎంపీటీసీ ఎన్నికల సమయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరో గ్రామస్థుడైన మారు సాయిరెడ్డిని తమ గ్రామంలో గెలిపించమని.. అందుకు తమ ఊరు వాగుపై రెండేళ్లలో బ్రిడ్జి నిర్మిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి నాలుగేళ్లు పూర్తయినా.. ఎలాంటి నిర్మాణం చేయలేదు. తమ ఊరి అభివృద్ధి కోసం బ్రిడ్జి నిర్మాణం అయితే వేములవాడకు చుట్టుపక్కల ఊర్లకు రోడ్డు సౌకర్యం ఏర్పడుతుందని, అదేవిధంగా రైతులు, గీతా కార్మికులకు వర్షాకాలం 20 కి.మీ. చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని గ్రామస్థులు ఆశపడ్డారు.
బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్పి ఎమ్మెల్యే బాండ్ పేపర్ రాసిస్తే.. గ్రామస్థులంతా... మారు సాయిరెడ్డిని గెలిపించారు. రెండేళ్లలో పూర్తి చేస్తామన్న బ్రిడ్జి నాలుగేళ్లే గడచినా.. పనులు మాత్రం ప్రారంభం కాలేదని కొండ్రికర్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మె్ల్యే రాసిచ్చిన బాండ్ పేపర్ కు ఆదివారం నాలుగో సంవత్సరం పిండ ప్రదానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల రాజగంగు, ఉప సర్పంచ్ గంట రాజేశ్వర్, మారు జనార్ధన్ రెడ్డి, ఆనంద్, బద్దం రమేష్, సంకు రాకేష్, సబ్బని అశోక్, మెండే జలంధర్ గ్రామస్థలు పాల్గొన్నారు.