- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS షర్మిలను చూస్తే.. TRS నేతలకు వణుకు: డాక్టర్ నగేశ్
దిశ, కరీంనగర్ టౌన్: తెలంగాణలో కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ ఆటవిక పాలన, నియంత పాలనను ఎండగడుతూ.. ప్రజల పక్షాన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రను అడ్డుకోవడం, వాహనాలను దగ్ధం చేయడం, అరెస్టు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నగేష్ ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గం లింగగిరి గ్రామంలో షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ఒక పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. ప్రజాప్రస్థానం యాత్ర బస్సును టీఆర్ఎస్ గుండాలు తగలబెట్టినా.. అధికార పార్టీ గూండాలను వెంటనే అరెస్టు చేయకపోగా.. షర్మిలపై 9 కేసులు నమోదు చేయడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందన్నారు. పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకను అణచివేయాలని చూస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు.
ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ షర్మిలకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. పాదయాత్రను ఆపాలని చూస్తున్న టీఆర్ఎస్ నాయకులకు వైఎస్ షర్మిలని చూస్తే వణుకు పుడుతుందన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. షర్మిళ పాదయాత్రకు కోర్టు అనుమతి ఇచ్చినా.. వరంగల్ పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేసి అడ్డుకుంటున్నారని.. తెలంగాణాలో పోలీస్ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. దమ్ముంటే.. ఎన్నికలలో షర్మిలను ఎదుర్కోవాలి అని కేసీఆర్‌కి ఛాలెంజ్ చేశారు. తెలంగాణ లో పోలీసు రాజ్యం కొనసాగుతుందన్నారు. ఆసలు హోం మంత్రి ఉన్నాడా?.. లేరా..? అని ప్రశ్నించారు.