- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే దాసరికి పెద్దపల్లి టికెట్ ఇవ్వొద్దు : మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య సంచలన ప్రెస్ మీట్
అసలైన కార్యకర్తలు అస్త్ర సన్యాసం చేశారు
టికెట్ ఇస్తే ప్రగతి భవన్ ముందునిరాహార దీక్ష చేస్తాం..
చిచ్చా .. నీకు బ్యాడ్ టైం స్టార్టైందంటూ వ్యంగాస్త్రాలు
మాజీ మునిసిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య సంచలన ప్రెస్ మీట్
దిశ, పెద్దపల్లి : దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిందని అసలైన బీఆర్ఎస్ ఉద్యమకారులు అస్త్ర సన్యాసం చేశారంటూ, దాసరికి మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య తిరుగుబావుట ఎగుర వేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పని చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన తమ లాంటి నాయకులను దాసరి మనోహర్ రెడ్డి దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం తన స్వార్థం కోసం, వ్యక్తిగతంగా తనకు కొమ్ము కాసే వారిని తన దగ్గర ఉంచుకున్నాడని ఎల్.రాజయ్య విమర్శించారు. తాను మున్సిపల్ చైర్మన్ గా టెండర్ అయిన పనులను కూడా రద్దు చేయించి తానే మళ్లీ నిర్మిస్తున్నాడని మున్సిపల్ కార్యాలయ భవనం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలకు తమ ఆధ్వర్యంలోనే టెండర్లు పూర్తి చేశామన్నారు. కమిషన్ల కోసమే మనోహర్ రెడ్డి తాపత్రయమని, పెద్దపల్లిలో ప్రతి నిర్మాణం తానే భాగస్వామి అవుతున్నాడని ఆరోపించారు. తాను తప్పు మాట్లాడితే.. ఇదే విషయంపై నిజ నిర్ధారణకు వస్తారా అంటూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి బహిరంగంగా సవాల్ విసిరారు.
చిచ్చా... నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దుర్మార్గపు సంపాదన, మట్టి, ఇసుక దందాలతో నువ్వు చేద్దామనుకున్న వెంకటేశ్వర కళ్యాణం కూడా ఆ దేవుడికి నచ్చలేదని ఎద్దేవా చేశారు. చాలామంది నాయకులు అసంతృప్తితో ఉన్నారని, బయటకు రావడానికి కొంత సమయం పడుతోందని, అందరూ ఒకేసారి తమతో నడిచేందకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ టికెట్ దాసరి మనోహర్ రెడ్డికి ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకవేళ టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అదిష్టానం ప్రయత్నిస్తే.. ప్రగతి భవన్ ఎదుటే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి అదే విషయంపై తన పోరాటం కొనసాగుతోందని అన్నారు.