గొర్రెల మందపై కుక్కల దాడి.. 25 గొర్లు మృతి

by Shiva |
గొర్రెల మందపై కుక్కల దాడి.. 25 గొర్లు మృతి
X

దిశ, మల్లాపూర్: గొర్రెల మంద పై కుక్కలు దాడి చేసిన ఘటన మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యంపెట్ గ్రామానికి చెందిన రొడ్డ సురేష్ కు చెందిన గొర్రెల మందపై తెల్లవారుజామున కుక్కలు దాడి చేయడంతో స్థానికులు గమనించి వాటిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. అనంతరం సురేష్ కి సమాచారమిచ్చి వచ్చి చూసే సరికి సుమారు 25 గోర్లు మృతి చెందినట్లుగా వారు తెలిపారు. సుమారు రూ.1.50 లక్షల మేర నష్టం వాటిల్లిందంటూ బాధితుడు సురేష్ తనను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశాడు.

Advertisement

Next Story

Most Viewed