రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఈ యాప్‌లను టచ్ చేయొద్దు: SI ఆంజనేయులు

by Anjali |
రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఈ యాప్‌లను టచ్ చేయొద్దు: SI ఆంజనేయులు
X

దిశ గాంధారి: సైబర్ నేరాల పట్ల ప్రజలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎంతో అవగాహన కల్పించిన హ్యాకర్లు తమ యొక్క రూటు మార్చి ఏకంగా వ్యక్తుల యొక్క వాట్సాప్ ను హ్యాక్ చేసి ఆయనే వాట్సప్ గ్రూపులో పంపుతున్నట్లు గ్రూపుల్లో సమాచారాన్ని పంపడంతో ప్రజలకు అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతున్న సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గాంధారి మండల కేంద్రానికి చెందిన జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి మొబైల్ షాప్ నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అయితే అతనికి తెలియకుండానే అతని యొక్క మొబైల్ వాట్స్అప్ హ్యాకింగ్ అయిన సంఘటన తెలుసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.

వాట్సప్ హ్యాక్ అయిందని ఎలా తెలుసుకోవాలంటే..

ఎవరైతే వాట్సప్ హ్యాక్ అయిందని తెలుసుకోవాలంటే తమ యొక్క మొబైల్ లో వాట్సాప్ ఓపెన్ కాకుండా ఉండడం ఓపెన్ చేసిన ఓపెన్ కాకపోవడం అంతేకాకుండా వారు మెసేజ్ పంపకపోయినా వేరే గ్రూపులలో వేరే వాళ్లకు మెసేజ్లు వెళ్లడం దీని ద్వారా వాట్స్అప్ హ్యాక్ అయిందని భావించవచ్చు.ఇది ఎలా జరిగిందంటే హాకింగ్ లో కొత్త ఒరవడిలో భాగంగా వాట్స్అప్ కు సంబంధించిన పూర్తి డాటా సైబర్ నెరగల చేతికి వెళ్తుంది అయితే వాస్తవానికి ఉపయోగించే అతడి ఫోన్లో వాట్స్అప్ పనిచేయదు కానీ అతను పంపించినట్టుగానే మిగతా వారందరికీ వివిధ వాట్సాప్ గ్రూప్ లలో ఎస్బిఐ బ్యాంకు నుండి నాకు 5500 వచ్చినట్టు ఆయన తెలుపు విన్నట్టు ఆయన మెసేజ్ చేయకుండానే హ్యాకర్లు ఆయన మొబైల్ ఫోన్ను వాట్సప్ ద్వారా వాడుకొని గ్రూప్ లలో సందేశాన్ని పంపడం జరిగింది. దీంతో అందరూ ఎప్పుడూ లేని జ్ఞానేశ్వర్ ఇలా మెసేజ్ చేయడం నిజంగానే వచ్చింది అనుకొని అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది దీంతో సామాన్య ప్రజలకు జేబులకు చిల్లు పడింది. కొంతమంది చెప్పుకోకుండానే లో లోపల బాధపడుతున్నారు.

.apk...యాప్ లను టచ్ చేయొద్దు-ఎస్ఐ ఆంజనేయులు

సైబర్ నేరాలు పట్ల ఎంతో అవగాహన కల్పించిన హ్యాకర్లు కొత్త ఉరవడితో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా .Apk అనే యాప్ లను అస్సలు టచ్ చేయొద్దని వాటిని వాడద్దని అలా చేస్తే తమ యొక్క డాటా మొత్తం హ్యాకర్ల చేతుకు వెళ్తుందని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ఇప్పటివరకు మండల కేంద్రంలో నాలుగు నుంచి ఐదు సైబర్ నేరాలు జరిగాయని సైబర్ నేరాల పట్ల ఎంతో అవగాహన కల్పిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు కృషి చేయాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed