Puri Jagannadh: షాకింగ్ నిర్ణయం తీసుకున్న పూరి జగన్నాథ్.. ఆ హిట్ సినిమాకి సీక్వెల్ ప్లాన్.. హీరో ఎవరంటే?

by Prasanna |   ( Updated:2024-10-28 09:58:52.0  )
Puri Jagannadh: షాకింగ్ నిర్ణయం తీసుకున్న పూరి జగన్నాథ్.. ఆ హిట్ సినిమాకి సీక్వెల్ ప్లాన్.. హీరో ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో వరుస హిట్స్ , వరుస ఫ్లాప్స్ చూశాడు. అయిన కూడా ధైర్యంతో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. నిజం చెప్పాలంటే విజయ్ దేవరకొండ లైగర్ మూవీ పూరీ కెరియర్ని డౌన్ అయ్యేలా చేసింది. అది సరిపోదు అన్నట్టు హీరో రామ్ తో డబుల్ ఇస్మార్ట్ అంటూ వచ్చాడు అది కూడా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పూరీ డైరెక్ట్ చేసిన " ఇడియట్ " (Idiot)మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా, చంటి గాడు లోకల్ అనే డైలాగ్ ఇప్పటికీ ఎవరో ఒకరు గుర్తు చేస్తూనే ఉంటారు. వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న పూరీకి, హీరోలు కాల్ షీట్లు ఇవ్వడానికి భయపడుతున్నారు. ఇవ్వన్ని కాదులే అనుకుని పెద్ద హిట్ అయిన ఇడియట్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీలో రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్నాడని తెలిసిన సమాచారం. హీరోయిన్ గా శ్రీ లీలను (Sreeleela) సంప్రదించనున్నారని తెలుస్తుంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలి అంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.

Read More : Tollywood: పదేళ్ళ నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

Advertisement

Next Story