- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పత్రికా రంగంలో ‘దిశ’ సంచలనం
దిశ, రుద్రంగి : నిజాలను నిర్భయంగా రాయడంలో దిశ దిన పత్రిక స్టైల్ వేరు అని రుద్రంగి ఎస్ఐ సిరిసిల్ల అశోక్ అన్నారు. మంగళవారం రుద్రంగి పోలీస్ స్టేషన్లో దిశ 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలంతో సమానంగా పరుగెడుతూ సమాజంలో జరిగే సంఘటనలు ఎప్పటికప్పుడు వార్తల రూపంలో అందించడంలో దిశ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అన్నారు.
అతి తక్కువ కాలంలో అన్ని పత్రికలకు దీటుగా వార్తలు అందిస్తూ ముందంజలో ఉందని, ఏ మూలన ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లో పాఠకుల ముందుకు చేర్చిడంలో దిశ ముందంజలో ఉంది అన్నారు. రాబోయే రోజుల్లోనూ ప్రజా సమస్యలను వెలికి తీస్తూ ఇలాగే ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో రుద్రంగి మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిశ పాత్రికేయులు పీసరి కిషన్, గసికంటి రాజు, కత్తి రాజు, ఎల్లాల నర్సారెడ్డి, దెగవత్ తిరుపతి, నెరేళ్ల శేఖర్ పాల్గొన్నారు.