- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘దిశ’ ఎఫెక్ట్.. కబ్జా భూమి తిరిగి ప్రభుత్వానికి అప్పగింత
దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : దిశ కథనానికి స్పందన లభించింది. మూడు రోజుల క్రితం దిశ తెలుగు దినపత్రికలో "భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు" అనే కథనంలో జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలోని 464 సర్వేనెంబర్ లో ప్రభుత్వ భూమి కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టారని ప్రచురించింది. దాంతో స్పందించిన రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. దీంతో తాను కబ్జా చేసిన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని సుంచుల కుమార స్వామి మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో తిరిగి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు.
కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చిన కుమారస్వామిని జిల్లా కలెక్టర్, ఎస్పీలు అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదరు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని, ఈ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతుబంధు, పీఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినందుకు ఆ సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటిదాకా దాదాపు 250 ఎకరాలు ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. దిశ కథనంతో ప్రభుత్వం భూమి తిరిగి ప్రభుత్వానికి చేరడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.