- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల సంక్షేమం కోసమే క్రిబ్ కో : టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు
అపోహలు వీడి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించాలి
ప్రజలకు అన్యాయం చేసే ఆలోచన మాకు లేదు
మా శవాల మీద ఫ్యాక్టరీ పునాదులు వేసుకోండన్న ప్రజలు
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కలెక్టర్ అవగాహన సదస్సు
దిశ, వెల్గటూర్ : రైతుల సంక్షేమం కోసమే క్రిబ్ కో పని చేస్తుందని, ఇది పూర్తిగా రైతు సహకార సంస్థ, దీనిలో పది వేల మంది రైతులతో పాటు మేము కూడా సభ్యులుగా ఉన్నామని, రైతులకు అన్యాయం చేసే పని ఎప్పటికీ చేయబోమని, లేటెస్ట్ టెక్నాలేజీతో చుక్క నీరు కూడా బయటకు రాకుండా ఇక్కడ నిర్మించే ఇథనాల్ ఫ్యాక్టరీ పని చేస్తుందని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు.
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి, పాషిగాం గ్రామాల్లో నిర్మాణం చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీపై శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ యాస్మిన్ బాషా హాజరై.. ఇథనాల్ ఫ్యాక్టరీ పై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. దీని పై గ్రామస్థుల ఆపోహలను తొలగించాలనే రాజకీయాలకు అతీతంగా ఇక్కడికి కలిసి వచ్చామని కొండూరు రవీందర్రావు, పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇద్దరం తెలుగు వాళ్లమేనని.. సహకార సంస్థల్లో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తులమని అన్నారు.
తెలుగు వాళ్లం అయి ఉండి క్రిబ్ కో సంస్థ ద్వారా మన తెలుగు వారికి అన్యాయం చేయాలని తాము ఎప్పుడూ అనుకోమని ప్రజలకు హామీ ఇచ్చారు. పదేళ్ల క్రితం నిర్మించిన ఇథానాల్ ఫ్యాక్టరీలను చూసి మీరు అపోహ పడుతున్నారని అన్నారు. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందని, లేటెస్ట్ టెక్నాలజీతో ప్రస్తుతం ఫ్యాక్టరీని నిర్మిస్తామని, దీని వల్ల గ్రామస్థులకు ఎలాంటి హానీ జరగదని స్పష్టం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ మీ దగ్గరే నిర్మించడం అదృష్టంగా భావించాలన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
తద్వారా భవిష్యత్తు తరాలు బాగుపడుతాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గుజరాత్ లో క్రిబ్ కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభించారని తెలిపారు. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అని.. దీని వల్ల ఎలాంటి కాలుష్య కారకాలు బయటకు విడుదల కావన్నారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా ఈ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రజలకు సూచించారు. ఇదే టెక్నాలజీతో దేశంలోని గుజరాత్ లో నడుస్తున్న ఫ్యాక్టరీకి స్వయంగా గ్రామస్థులను తీసుకెళ్లి చూపిస్తామని తెలిపారు. క్రిబ్ కో సంస్థ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు తన ఉత్పత్తులను అందిస్తూ.. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును అదృష్టంగా భావించాలి : కలెక్టర్ యాస్మిన్ భాష
ఇథనాల్ పరిశ్రమను స్తంభంపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం గ్రామస్థులు అదృష్టంగా భావించాలని కలెక్టర్ యాస్మిన్ భాష అన్నారు. ఇది హానికరమైన పరిశ్రమ కాదని.. పూర్తిగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమని తెలిపారు. చుక్క వ్యర్ధ పు నీరు సైతం బయటకు రాకుండా లేటెస్ట్ టెక్నాలజీ తో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారని తెలిపారు. ఇందులో గ్రామస్థులు పండించే పంటలను మాత్రమే వినియోగిస్తారని తెలిపారు.
పెట్రోల్ డీజిల్ కోసం మిడిల్ ఈస్ట్ దేశాలపై పైన దేశ ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని, పెట్రోల్, డీజిల్ నుంచి వెలువడే కార్బన్ వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడి అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే పెట్రోల్ లో 20శాతం ఇథనాల్ కలిపి వినియోగిస్తే గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించవచ్చని కలెక్టర్ తెలిపారు. బయో ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు.
మా శవాల మీద ఫ్యాక్టరీ పునాదులు వేసుకోండి : గ్రామస్థులు
కలెక్టర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు మాట్లాడుతున్నత సేపు సావధానంగా విన్న గ్రామస్థులు ఏది ఏమైనా ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించవద్దని పట్టబట్టారు. తమ జీవితాలతో చెలగాటం అడొద్దని, అగ్ని గోళాన్ని తీసుకొచ్చి తమ నెత్తిన పెట్టొద్దని వేడుకున్నారు. ఇది మీకు న్యాయం కాదని, ఇక్కడి నుంచి దీనిని వెంటనే తరలించాలని, తమని కాదని ఇతనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించాలనుకుంటే మా శవాల మీద ఫ్యాక్టరీ పునాదులు వేసుకోవాలని స్తంభంపల్లి, పాషిగాం గ్రామస్థులు స్పష్టం చేశారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ స్థాపించి తమ జీవితాలతో ఆటాడుకోవద్దని, తక్షణమే దీనిని ఇక్కడి నుంచి తరలించాలని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు స్తంభంపల్లి సర్పంచ్ భర్త చల్లూరి రామచంద్రం, ఎంపీటీసీ పోడేటి సతీష్, సర్పంచ్ బొప్పు తిరుపతి, యువకులు గోంటి కిరీటి, గోపతి నరేష్ విజ్ఞప్తి చేశారు. అధికారులు పోలీసులు ప్రజలకు చివరి వరకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా గ్రామస్థులు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై తమ మొండి పట్టు వీడలేదు.
మా ప్రాణాలకు హాని కలిగించే ఫ్యాక్టరీ ఇక్కడ వద్దంటే వద్దని ప్రజలంతా నినదిస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చేసేదేమి లేక తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సై నరేష్, ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.