దేశ సంపదనను బీజేపీ ప్రభుత్వం లూటీ చేస్తున్నది: సీపీఎం

by S Gopi |   ( Updated:2023-02-28 10:28:40.0  )
దేశ సంపదనను బీజేపీ ప్రభుత్వం లూటీ చేస్తున్నది: సీపీఎం
X

దిశ, కరీంనగర్ టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు కారు చౌకగా దోచిపెడుతూ దేశాన్ని లూటీ చేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మిలుకురి వాసుదేవరెడ్డి ఆరోపించారు. నేడు సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఏవోకి సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద, బడుగు, బలహీనవర్గాలకు ఉపయోగకరంగా లేదని, కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని విమర్శలు చేశారు.

దేశంలో మతోన్మాదదాడులు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రశ్నించే రచయితలను, కవులను, కళాకారులను, మీడియాను, జర్నలిస్టును బెదిరించడం, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలచే దాడులు చేయిస్తుందని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉపాధికల్పన రంగాలకు ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలని డిమాండ్ చేశారు. ఐదు కేజీల ఉచిత బియ్యంతోపాటు ఐదు కేజీల సబ్సిడీ బియ్యం స్కీంను పునరుద్ధరించాలన్నారు. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, కూలిరేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ధనికులపై సంపద, వారసత్వ పన్ను విధించాలని, వారికిచ్చే పన్నురాయితీలు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఆహారం, మందులపై జీఎస్టీ రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు అన్ని రకాల వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించి పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, కార్మికహక్కులు హరించివేసే విధంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగావకాశాలు కల్పించాలని, జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే జీవో 333ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.



ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి, వర్గసభ్యులు గిట్ల ముకుందరెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు యు శ్రీనివాస్, ఎడ్ల రమేష్, జి రాజేశం, శనిగరపు రజనీకాంత్, శీలం అశోక్, డి నరేష్, జిల్లా నాయకులు వడ్ల రాజు, కవంపల్లి అజయ్, ద్యావ అన్నపూర్ణ, జి. తిరుపతి నాయక్, గజ్జల శ్రీకాంత్, రాఐకంటి శ్రీనివాస్, గుండేటి వాసుదేవ్, మాతంగి శంకర్, పున్నం రవి, కనకరాజు, బోడా మోహన్, రవీందర్ నాయక్, సీహెచ్ రాములు, సురేష్, వినయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed