- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శంకరపట్నం తహసీల్దార్‌పై అవినీతి ఆరోపణలు
దిశ బ్యూరో, కరీంనగర్: అధికారం చేతిలో ఉంది కదా అని తహశీల్థార్ చేసిన నిర్వాకం పనికి ఓ కుటుంబం ఇబ్బందులు పడుతున్నది. సామాన్యులు తమ భూ సమస్యలపై కార్యాలయాలకు వెళ్తే సవాలక్ష సాకులు చెప్పి పనులు పెండింగ్ లో పెట్టే కొందరు అధికారులు కరెన్సీ నోట్లకు కక్కుర్తి పడి తాము తలుచుకుంటే కాని పని లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శంకరపట్నం తహశీల్దారు అనుపమ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తహశీల్దార్ సూత్రధారిగా వ్యవహరించి తప్పుడు ధృవపత్రాలతో తమకు చెందిన భూమిని ఇతరులకు విరాసత్ చేసిందంటూ సదరు అధికారిణి పై చర్యలు తీసుకోవాలని ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేయడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని నల్ల వెంకయ్య పల్లి గ్రామానికి చెందిన ప్రొద్దుటూరి వీరారెడ్డి కి సర్వే నంబర్ 714 ,721 లో 2. 32 గుంటల భూమి ఉంది. అయితే భార్యభర్తల (వీరారెడ్డి, భార్య జమున) మద్య కుటుంబ కలహాల నేపథ్యంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం భర్త వీరారెడ్డిని వదిలి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రింద ప్రొద్దుటూరి వీరారెడ్డి అనారోగ్యంతో మరణించాడు. దీంతో వీరారెడ్డి పేరుపై గల 2.32 గుంటల భూమిని ఎలాగైనా తన పేరున చేసుకోవాలని జమున నిర్ణయించుకుంది. అందుకు జమున తన పేరున విరాసత్ చేసుకునేందుకు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కు అయ్యిందని ఆగ మేఘాల మీద రెవెన్యూ సిబ్బందికి పెద్ద మొత్తంలో డబ్బులు ఎరవేసి అక్రమంగా విరాసత్ చేసికున్నదని వీరారెడ్డి తల్లి శంకరమ్మ తహశీల్దారు కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
తప్పుడు విరాసత్ చేసుకునేందుకు జమున ఆధార్ కార్డును ఎడిట్ చేసి దానికి అనుగుణంగా కుటుంబ ధ్రువీకరణ పత్రం తయారు చేసి తదనుగుణంగా విరాసత్ పేరుతో అధికారులు పట్టా మార్పిడి చేశారని బాధితురాలు ఆరోపించారు. కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రంలో వీరారెడ్డి తల్లి బతికి ఉన్నప్పటికీ తన పేరును చేర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది, అంతే కాకుండా రేషన్ కార్డు ను ప్రాతిపదికగా తీసుకోకపోవడం కూడా రెవెన్యూ అధికారుల తీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. చనిపోయిన వీరారెడ్డి పట్టాదార్ పాస్ బుక్ బ్యాంకులో తనఖా ఉండగానే తహసీల్దార్ అనుపమ డబ్బులు తీసుకుని విరాసత్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి విరాసత్ రద్దుచేసి సదరు తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని వీరారెడ్డి తల్లి శంకరమ్మ అధికారులను వేడుకుంటుంది.
అనుపమ ఆదినుంచి వ్యవహరం వివాదాస్పదమే
తహశీల్దారు అనుపమ వ్యవహారం ఆదినుంచి వివాదాస్పదమే అనే ఆరోపణలున్నాయి. గత పాలకుల సామాజిక వర్గానికి చెందిన అనుపమ గత ప్రభుత్వంలో తనకు ఎదురే లేదన్నట్టుగా వ్యవహరించి జిల్లా స్థాయి అధికారులను సైతం తన చెక్కు చేతల్లో పెట్టుకునేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తనకు శంకరపట్నం నుంచి హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయం ఏవోగా బదిలి కాగా 24 గంటలు తిరగక ముందే తన పలుకుబడితో గంగాధర తహశీల్దారుగా పోస్టింగ్ తెప్పించుకుందని రెవెన్యూశాఖలో చర్చించుకుంటున్నారు.