- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కౌశిక్ రెడ్డి ఓ మతి లేని వ్యక్తి.. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు..
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతి లేకుండా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాడని, కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే నీ తోలు తీస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు అన్నారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌశిక్ రెడ్డికి ప్రజల్లో ఏదో రకంగా ఉండాలనే ఫోబియా ఉందని అన్నారు. ఖాళీగా ఉన్న సమయంలో రీల్స్ చేసుకునే కౌశిక్ రెడ్డి పని లేనప్పుడల్లా ప్రజలతో పిచ్చి, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పని చేసే పార్టీ అని, తాము మాట ఇస్తే తప్పమని అన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ చూపించారు. ప్రోటోకాల్ ప్రకారం అభివృద్ధి పనుల్లో పాల్గొంటే తప్పు లేదని, కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీకి సంబంధించిన మాటలు మాట్లాడితే సహించేది లేదని అన్నారు. తనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతటా నిలదీస్తారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలు అతను నియమించలేదని, మేము అధికారంలోకి వచ్చాక అన్నిటికి పాలక వర్గాలు నియామకం చేస్తున్నామని అన్నారు.
దళిత బందు అతని ప్రభుత్వ హయాంలో పెట్టారని, అప్పుడు అందరికీ ఎందుకు ఇవ్వలేదని, ఇప్పుడు దళితుల పై మొసలి కన్నీరు కారుస్తున్నావని అన్నారు. అతని అండతో బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకోలేదని అన్నారు. త్వరలో అన్నిటి పై విచారణ చేయిస్తానని అన్నారు. కౌశిక్ రెడ్డి చేసిన అవినీతిని పూర్తి స్థాయిలో ఆధారాలతో బయట పెడతామని అన్నారు. నియోజక వర్గంలో ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తిచేస్తామన్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి హుందాగా ఉండాలని, ముఖ్యమంత్రి పై గానీ, కాంగ్రెస్ పార్టీ పై గానీ విమర్శలు చేస్తే సహించేది లేదని అన్నారు. దళిత బందులో అనేక అవకతవకలు జరిగాయని, దళిత బందు పథకంలో డబ్బులు రాని వారు ఆందోళన చెందవద్దని, డబ్బులు లబ్దిదారుల అకౌంట్ లో ప్రీజ్ అయి ఉన్నాయని, త్వరలో వారికి డబ్బులు అందేవిధంగా చూస్తామని అన్నారు. పూర్తి స్థాయి మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ప్రణవ్ తో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు.