- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా సంక్షేమానికై కాంగ్రెస్ కమిట్మెంట్ తో పనిచేస్తుంది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ,జగిత్యాల టౌన్ : ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కమిట్మెంట్ తో పని చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ఎవరు కూడా ఊహించలేదన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించిందన్నారు. అంతేకాకుండా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఆంక్షలు లేకుండా సన్న వడ్లకురూ. 500బోనస్ ఇస్తున్నట్లు వివరించారు. కొన్ని కొన్ని కులాలకు వృత్తిపరమైన సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ అన్ని కులాలకు కల్పించలేని పరిస్థితి ఉందన్నారు.
నేతన్నలకు వృత్తిపరమైన సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికి ఆశించిన స్థాయిలో అందడం లేదని తెలిపారు. అలాంటి సందర్భంలో వారికి ప్రత్యామ్నాయం చూపించాలని అదేవిధంగా క్వారీల లీజు పై హక్కులు వడ్డెర సొసైటీలకు కల్పించే విధంగా చర్యలు చేపడితే వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించ వచ్చినని అన్నారు. తద్వారా అన్ని కుల వృత్తుల వారికి సామాజిక న్యాయం అందడంతో పాటు పేద వెనుకబడిన వర్గాలకు ఉద్యోగ, రాజకీయ పరంగా అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. అయితే ప్రభుత్వం ఇంటింటి సమగ్ర కుటుంబ సభ్య సర్వేలో ఇంటికి స్టిక్కర్లు అతికించినప్పటికీ ఏ రోజు సర్వేకు ఇంటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నందున ఒక తేదీని కేటాయిస్తే కుటుంబ యజమాని ఇంటి వద్ద ఉండే అవకాశం ఉందని సూచన చేశారు.బలహీన వర్గాలకు రిజర్వేషన్ కోసం డెడికెటెడ్ కమీషన్‌ను సీఎం రెవంత్ రెడ్డి ఏర్పాటు చేయటం హర్శించదగ్గ విషయమన్నారు.. పౌరులు అందరూ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు.