కాంగ్రెస్ నాయకులు హౌస్ అరెస్ట్.. ప్రభుత్వ తీరుపై జీవన్ రెడ్డి ఫైర్

by samatah |
కాంగ్రెస్ నాయకులు హౌస్ అరెస్ట్.. ప్రభుత్వ తీరుపై జీవన్ రెడ్డి ఫైర్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉన్న గ్రామస్తులతో కలిసి జిల్లా కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగుతారనే ముందస్తు సమాచారం మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గృహనిర్బంధాలతో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇథనాల్ పరిశ్రమతో పంట పొలాలు పరిసరాలు కలుషితం అవుతాయని తెలిసినప్పటికీ దొంగ చాటుగా ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరంకుశ, నియంతృత్వ పాలన సాగుతోందని తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story