- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రైతులను నట్టేట ముంచుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం'
దిశ, పెగడపల్లి: రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అని, రైతుల పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్‌కి ఉన్న చిత్త శుద్ధి నిరూపించుకోవాలని డిసిసి అధ్యక్షుడు ధర్మపురి, నియోజక వర్గ ఇన్ ఛార్జ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధ్వజమెత్తారు. వరి ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకలు, ధరణి పోర్టల్ వల్ల నెలకొన్న సమస్యల మీద ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఒక్క రోజు రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటుగా బోనస్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు.
స్వరాష్ట్ర సాధన తర్వాత రైతుల బతుకులు మరింత బాగుపడతాయి అని ఆశించిన రైతులకు భంగపాటు తప్పలేదు అని ఒక్క రైతు బంధు ఇస్తూ రాయితీలు ఇవ్వకుండా చేతులు దులుపుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. స్థానిక మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులు, మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం తూకం లో కోత విధిస్తున్నారని ఆరోపించారు. రైతులను నట్టేట ముంచితున్నారని మంత్రికి రైతుల పట్ల ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్న ధాన్యం తరలించే సమయంలో ధర్మ కాంట వద్ద డిజిటల్ రశీదులు ఇప్పించి, రైతుల పట్ల తనకున్న బాధ్యతను చూపాలని డిమాండ్ చేశారు. అధికారులు, మిల్లర్ల ఇచ్చే కమిషన్‌లకు ఆశ పడి రైతుల పొట్ట కొట్టడం న్యాయమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల అనేక భూ సమస్యలు తలెత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని వెంటనే ధరణి పోర్టల్ వ్యవస్థను రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, సైలెందర్ రెడ్డి, బుర్ర రాములు గౌడ్, సుభాష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
READ MORE
రైతులకు మెడకు పట్టిన దరిద్రం ధరణి: మాజీ మంత్రి గీతారెడ్డి ఫైర్