- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత ఇలాకాలో మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ (వీడియో)
దిశ, గంభీరావుపేట: సొంత ఇలాకా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. కాగా, మంత్రి పర్యటన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కమాన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నాయకులను పక్కకు లాక్కెళ్లారు.
వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని నినాదాలు చేయడంతో పాటు.. రైతులకు ఎకరాకు రూ. 25 వేల నష్ట పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, మండల యువజన అధ్యక్షుడు భానోతు రాజు నాయక్, పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, బండలింగం పల్లి ఎంపీటీసీ పద్మ, కొత్తపల్లి పద్మాదేవయ్య, రాజు, ఉత్తర లక్ష్మణ్, గంగన్న, శ్రీకాంత్ రెడ్డి, పర్శరాములు పాల్గొన్నారు.