Collector surprise inspection : విద్యాలయాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి కలెక్టర్..

by Sumithra |
Collector surprise inspection : విద్యాలయాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి కలెక్టర్..
X

దిశ, వీర్నపల్లి / ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య పాఠశాల వీర్నపల్లి మండలం రంగంపేటలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దుమాలలోని ఏకలవ్య పాఠశాల తరగతి గదులు మైదానం, డైనింగ్ హాల్, టాయిలెట్స్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

వీర్నపల్లి మండలం రంగంపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించారు. స్కూల్ లోని తరగతి గదులు, వంట గది, మైదానం పరిశీలించి స్కూలులో మొత్తం ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారని ఎంఈఓ రఘుపతిని అడిగి తెలుసుకున్నారు. మొత్తం మూడు తరగతి గదులు ఉన్నాయని, దాదాపు 70 మంది విద్యార్థులు చదువుతున్నారని మరోగది నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్ దృష్టికి ఎంఈఓ తీసుకెళ్లారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

రోడ్డు పనులు పరిశీలన..

వీర్నపల్లి నుంచి మర్రిమడ్ల దాకా రోడ్డు నిర్మాణంలో భాగంగా వీర్నపల్లి మండల కేంద్రంలో చేపట్టిన సీసీ రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, హెచ్ఎం మానసవీణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story