- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Collector Koya Sriharsha : మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి..
దిశ, ముత్తారం: ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని వినియోగించుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముత్తారం మండలం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి విస్తృతంగా పర్యటించారు . మండలంలోని మైదంబండ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలల్లోని తరగతి గదులలో విద్యాబోధన ను తనిఖీ చేశారు. పాఠశాల లో ప్రహారీ గోడ మరమ్మత్తులకు అవసరమైన అంచనాలను రూపొందించి ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలలోని విద్యార్థులకు కలెక్టర్ టీ షర్ట్ లు అందజేశారు.
ముత్తారంలో శ్రీయాన్ మిల్క్ పార్లర్ ను ప్రారంభించిన కలెక్టర్..
ముత్తారం మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద శ్రీ రాజమాత గ్రామ సంఘం ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన శ్రీయాన్ మిల్క్ పార్లర్ ను కలెక్టర్ శ్రీహర్ష ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి జిల్లాలో 12 రకాల వివిధ వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు మహిళలకు అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నామని, మహిళా సంఘాలచే మీసేవ కేంద్రాలు ఆహార శుద్ధి కేంద్రాలు, పౌల్ట్రీ యూనిట్ మొదలగు వివిధ వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద లక్షా 90 వేల రుణం తో ముత్తారంలో మిల్క్ పార్లర్ ఏర్పాటు చేశామని, ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఖమ్మం పల్లిలో ఇసుక రీచ్ ను పరిశీలించిన కలెక్టర్..
ముత్తారం మండలంలో ఖమ్మంపల్లి గ్రామంలో ఇటీవలే ప్రారంభించిన ఇసుక రీచ్ ను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, ముత్తారం తాసిల్దార్ సుమన్ ఎంపీడీవో జి.లలిత, మండల పంచాయతీ అధికారి బి కిరణ్ ,పంచాయతీ రాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఎం.వరలక్ష్మీ, ఎడిఎం డి .పద్మ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.