- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అండగా ఉంటాం.. అధైర్య పడవద్దు : సీఎం కేసీఆర్
దిశ, కరీంనగర్ బ్యూరో: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ అన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని.. నష్టపోయిన ప్రతి ఎకరానికి 10 వేల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కరీంనగర్‌లో జిల్లాలోని వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయం నుంచి ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్.. మధ్యాహ్నం 4 గంటల వేళ హెలికాప్టర్ ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్ చేరుకున్నారు.
సీఎం కేసీఆర్‌కు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే లు సుంకె రవిశంకర్, రసమయి, దాసరి తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన సీఎం కేసీఆర్.. రైతులతో మాట్లాడి.. నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులతో పాటు కౌలు రైతులను సైతం ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వాస్తవానికి రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని.. దానిని సహాయ పునరావాస చర్యలు అని అంటారని చెప్పారు.
పంట నష్టం పై తాము కేంద్రానికి నివేదిక పంపేది లేదని స్పష్టం చేశారు. దేశంలో ఇన్సూరెన్స్ కంపనీ లకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్ప.. రైతులకు అండగా నిలిచే బీమాలు.. కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవన్నారు. భారతదేశంలో కొత్తగా వ్యవసాయ పాలసీ రావాలని సీఎం.. ఇప్పుడు దేశంలో ఒక డ్రామా నడుస్తోందన్నారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా ఉందని.. వాళ్ళకు రాజకీయాలు తప్ప.. ప్రజలు, రైతులు అవసరం లేదన్నారు. అందుకే తాము పంట నష్టం పై కేంద్రానికి నివేదిక పంపాలనుకోవడం లేదని.. మా రైతులను మేమే వంద శాతం కాపాడుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి : జర్నలిజాన్ని రక్షించండి.. గవర్నర్‌కు టీయుడబ్ల్యూజే వినతి