- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Children orphaned : తల్లి, తండ్రి మృతి.. అనాధలైన పిల్లలు..
దిశ, కాల్వశ్రీరాంపూర్ : తల్లి తండ్రిని కోల్పోయి ఆశనపల్లి గ్రామంలో అనాధలైన ఇద్దరు పిల్లలు ఆర్థిక సహాయ చేయాలని, వారిని ఆదుకోవాలని కోరుతున్నారు గ్రామ ప్రజలు. మండలంలోని ఆశన్నపల్లి గ్రామానికి చెందిన మంద ఐలయ్య నెల క్రితం మృతిచెందగా, సోమవారం తల్లి మంద భాగ్య కూడా మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. కొడుకు మంద అభిలాష్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతుండగా, కూతురు మంద మనిషా ఏడవ తరగతి పెగడపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది. నిరుపేద కుటుంబం అవ్వడంతో వారికి ఎమ్మెల్యే విజ్జన్న రూ. 5 వేలు, ఎల్ఐసి ఏజెంట్లు 10వేలు, సహాయాన్ని అందజేశారని, అలాగే స్థానిక నాయకులు కూడా వారికి తోచిన సహాయాన్ని అందించాలని గ్రామస్తులు కోరారు.
తల్లిదండ్రులు లేక అనాధలైన పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి సహాయం చేయాలని, కనీసం ఇల్లు లేని పరిస్థితిలో, పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం పరంగా స్థానిక ఎమ్మెల్యే చొరువ చూపి వారికి ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. సహాయం చేసిన వారిలో మాజీఎంపీపీ సారయ్య గౌడ్, ఎల్ఐసి ఆఫీసర్లు విశ్వనాథం, లట్ట మధుకర్, టీ.అఖిల్ యాదవ్, బొమ్మనవేన సిద్ధార్థ్, ముస్కు అశోక్, కాసర్ల మౌనిక, ములుకుంట్ల నరేష్, అనుముల రాజు, అనుముల అశోక్, తోడేటి కిరణ్, గోగుల విష్ణువర్ధన్ రెడ్డి, లోమిట మహేందర్లు ఉన్నారు. ఇంకా సహాయం చేయవలసిన వారు ఫోన్ పే నంబర్ 9652944801 సహాయం చేయాలని పిల్లల కుటుంబ సభ్యులు తెలిపారు.