ASP Seshadrini Reddy : వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో భద్రతాచర్యలు తప్పనిసరి..

by Sumithra |
ASP Seshadrini Reddy : వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో భద్రతాచర్యలు తప్పనిసరి..
X

దిశ, వేములవాడ : వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ప్రజాభద్రత చర్యలు తప్పనిసరి అని, తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ లో భాగంగా 100 మంది పైబడి జనసంచారం ఉండే అన్నిరకాల సంస్థల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని వేములవాడ సబ్ డివిజన్ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్- 2013 ప్రకారం వేములవాడ మున్సిపల్ పరిధిలో 100 మంది కన్నా ఎక్కువ జనసంచారం ఉండే వ్యాపార, వాణిజ్య సంస్థలు (కమర్షియల్ భవనాలు, షాపింగ్ మాల్స్, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చుకోవాలన్నారు.

సీసీ కెమెరాల డేటా 30 రోజుల వరకు భద్రపరిచే విధంగా పరికరాలు అమర్చుకోవాలని, భద్రపరిచిన డేటాను నేరాల నియంత్రణలో భాగంగా అవసరమున్న సందర్భాల్లో సంబంధించిన అధికారులకు అందజేయలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని, తనిఖీల సమయంలో సీసీ కెమెరాలు లేకున్నా, ఉన్న కెమెరాలు పని చేయకున్నా సంబంధిత యజమానికి చట్టం ప్రకారం రూ. 15 వేలు జరిమాన విధించడంతో పాటు అవసరమైతే సదరు వ్యాపార, వాణిజ్య సముదాయాలకు సంబంధించిన లైసెన్స్ లను రద్దుకు సిఫార్సు చేస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed