ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

by Sridhar Babu |
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, జగిత్యాల : ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల నుండి నిర్మల్ వెళ్తుండగా మోరపెల్లి గ్రామ శివారులో వెనుక టైర్లు రెండు ఒక్క సారిగా ఊడిపోయాయి.

అకస్మాత్తుగా జరిగిన పరిణామంతో ఏమైందో అర్థం కాక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఊడిపోయిన రెండు చక్రాలు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లి పడగా డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలిపాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయట పడ్డారు.

Advertisement

Next Story