- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాపై కేసు కుట్రపూరితం.. బీజేపీ కార్యకర్తలకు బండిసంజయ్ లేఖ
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే జైలు నుంచి బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ లేఖ రాశారు. తనపై కుట్రపూరితంగా పేపర్ లీక్ పెట్టారని పేర్కొన్నారు. లీకేజ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. తనకు కేసులు, కోర్టులు కొత్త కాదని తెలిపారు. ఎంతగా విసిరికొమడితే అంతగా పోరాటం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
భారతీయ సమాజ నిర్మాణమే బీజేపీ లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు. ప్రాణం పోయినా లక్ష్య సాధనను మరవొద్దని సూచించారు. ‘తెలంగాణ పాలకులు కుట్ర, కుతంత్రాలు చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీలో మంత్రి కేటీఆర్ పాత్రను ఎత్తి చూపినందుకే నాపై కేసు పెట్టారు. ప్రజలకోసం ఎన్నిసార్లైనా జైలుకెళ్తానన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడింది.’ అని బండి సంజయ్ ఆరోపించారు