Bandi Sanjay : వరదవెళ్లిలో భక్తులకు బోటు సేవలు అందుబాటులోకి

by Aamani |
Bandi Sanjay : వరదవెళ్లిలో భక్తులకు బోటు సేవలు అందుబాటులోకి
X

దిశ, బోయినపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయినపల్లి మండలం,ముంపు గ్రామమైన వరదవెల్లిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం మధ్య మానేరు జలాశయంలో కలదు. ఆ కారణంగా స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్లలేక ఉన్న నేపథ్యంలో గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని హోదాలో స్వామివారి దర్శనానికి విచ్చేసిన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భక్తుల సౌకర్యార్ధం "బోటు సౌకర్యం" కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి బోటు సేవలను ప్రారంభించి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని బోటులో వెళ్లి దర్శించుకున్నారు.

అనంతరం కేంద్ర మంత్రి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ బోట్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం తో పాటు ప్రతి ఒక్కరూ స్వామి ఉత్సవాల్లో సంతోషంగా పాల్గొనే అవకాశం లభించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంట జిల్లా కలెక్టర్, మండల అధికారులు, భాజపా మండలాధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి,ఉపాధ్యక్షులు భోగోజి గంగాధర్ చారి,చొప్పదండి నియోజకవర్గం భాజపా జాయింట్ కన్వీనర్ ఉదారి నరసింహ చారి,తదితర భాజపా నాయకులు, కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed