- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారీ ఎజెండాతో బల్దియా మీటింగ్.. కార్పొరేటర్లకు భారీ సైజు బుక్స్
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్‌కు భారీ ఏజెండా సిద్ధమైంది. ఈనెల 9న జరగనున్న ఈ సమావేశంలో 555 అంశాలతో కూడిన ఎజెండా తయారు చేశారు. ఈ జంబో ఎజెండాలోని అంశాలను బుధవారం నాటి సర్వసభ్య సమావేశం తీర్మాణం చేయాల్సి ఉంది. బల్దియా పరిధిలో కార్పొరేషన్ చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, చేపట్టాల్సిన పనులు, తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏకంగా 555 అంశాలపై తీర్మాణాలు చేసేందుకు సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఉదయం 11 కలెక్టరేట్ ఆడిటోరియంలో జరగనున్న ఈ సమావేశంలో 555 అంశాలపై చర్చించేందుకు ఎంత సమయం పడుతుంది..? ఇందుకు తగ్గట్టుగా ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తారో అంతుచిక్కడం లేదు. అయితే చాలా రోజుల తరువాత బల్దియా సమావేశం జరగనున్న నేపథ్యంలో అధికారులు మాత్రం జంబో ఎజెండా తయారు చేసి పార్ట్-1, పార్ట్-2లుగా రెండు భారీ సైజు బుక్స్‌ను కార్పొరేటర్లకు అందజేశారు.
అత్యంత విచిత్రం...
నగరంలో చేపట్టాల్సిన, చేపట్టిన పనులపై ఎజెండా అంశాల్లో వివరించిన తీరు చూస్తుంటే నిభందనలు అమలవుతున్నాయో లేదో అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. కొన్నింటి కొనుగోళ్ల విషయంలో మూడు కొటేషన్లు తీసుకున్నామని, ఇందులో కొటేషన్లో తక్కువ కోడ్ చేసిన వారికి పనులు అప్పగించామని వివరించారు. అయితే కొటేషన్లు ఎన్ని వచ్చినప్పటికీ బల్దియా నిబంధనల ప్రకారం టెండర్లకు పిలవాల్సి ఉన్నప్పటికీ అలాంటి చర్యలకే పూనుకోనట్టుగా విమర్శలు వస్తున్నాయి. అంతేగాకుండా కొన్ని అంశాల్లో పనులకు సంబంధించిన నగదు ఇస్తున్నామని వివరించారు. అయితే ఆ బిల్లు ఏ సంస్థ పేరిట ఇచ్చారు, ఆ సంస్థ ఎక్కడుంది అన్న వివరాలు మాత్రం లేకపోవడం విస్మయం కల్గిస్తోంది. రూ.5 లక్షలు వెచ్చించి బ్లీచింగ్ ఫౌడర్ కొనుగోలు చేయగా, రూ.3.35 లక్షలు వెచ్చించి లైమ్ ఫౌడర్ కొనుగోలు చేశామని ఎజెండాలో వివరించారు. ఎక్కువ శాతం అంశాలు కూడా పెండింగ్ అప్రూవల్ ద్వారానే తీర్మాణం కోసం ప్రవేశ పెడుతుండటం విశేషం. అంతేగాకుండా 2019 మార్చి నెలలో కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో వెచ్చించిన ఖర్చులకు సంబంధించిన బిల్లులు మంజూరీ చేసేందుకు బుధవారం నాటి సమావేశంలో ఎజెండా అంశంగా పెట్టడం గమనార్హం.