జాతీయ రహదారి భూసేకరణపై శ్రద్ధ వహించాలి

by Sridhar Babu |
జాతీయ రహదారి భూసేకరణపై శ్రద్ధ వహించాలి
X

దిశ,పెద్దపల్లి : వరంగల్, మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తిచేసే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో భూ సేకరణ అంశాలపై అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ -మంచిర్యాల 136 జి 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పెండింగ్ భూసేకరణ త్వరగా ముగిసేలా చూడాలని సూచించారు.

అవార్డు పాస్ చేసిన భూసేకరణ కేసులను సంబంధిత జాతీయ రహదారి అథారిటీకి అప్పగించాలని, పెండింగ్ లో ఉన్న పేమెంట్స్ వివరాలను తెప్పించుకొని త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ లను ఆదేశించారు. అనంతరం సింగరేణికి సంబంధించి పెండింగ్ ఆర్&ఆర్ సమస్యలపై రివ్యూ నిర్వహించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, సింగరేణి భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, సంబంధిత తహసీల్దార్ లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story