- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాణ్యమైన సేవలకు చిరునామా పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రి : ఎమ్మెల్యే
దిశ,పటాన్ చెరు : ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్ చెరు పట్టణంలో టంగుటూరి అంజయ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నాణ్యమైన సేవలకు చిరునామాగా నిలుస్తోందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి లోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి ప్రాంగణం తో పాటు చుట్టుపక్కల శానిటేషన్ సరిగా చేయడం లేదని సంబంధిత కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవో, వైద్యులు, సలహా సంఘం కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ఇటీవల కేంద్ర ఆరోగ్య శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి నాణ్యమైన సేవల విభాగంలో జాతీయ స్థాయిలో ఏడవ స్థానం లభించడం పట్ల ఆసుపత్రి వైద్యులను సిబ్బందిని అభినందించారు. త్వరలోనే అవార్డు రావడంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరిని సన్మానించబోతున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డిసిహెచ్ఎస్ అధికారి సంగారెడ్డి, ఆస్పత్రి సూపరిండెంట్ శ్రీనివాసరెడ్డి, ఆర్ఎంవో ప్రవీణ, కమిటీ సభ్యులు గాయత్రి పాండు, కంకర సీనయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.
*ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ...
పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డికి పటాన్చెరు నియోజకవర్గ ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.