- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
HYD: ఆసుపత్రులపై డీసీఏ అధికారుల దాడులు.. నార్కొటిక్ డ్రగ్స్ సీజ్
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్(HYD)లోని ఆసుపత్రుల(Hospitals)పై డ్రగ్ కంట్రోల్ అధికారులు(DCA Officers) దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుమతి లేకుండా నిల్వ చేసిన నార్కొటిక్ డ్రగ్స్(Narcotic Drugs) ను సీజ్ చేశారు. అక్రమంగా మందులు నిల్వ చేసి అమ్ముతున్నారని ముందస్తు సమాచారం అందుకున్న డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు(Drug Control Administration) ఎక్సైజ్ శాఖ(Excise Dept) అధికారులతో కలిసి పలు ఆసుపత్రులపై దాడులు(Raids) చేశారు. ఈ దాడుల్లో చాంద్రాయణ్ గుట్ట(Chandrayan Gutta)లోని బకోబన్ హస్పిటల్(Bakoban Hospital), వారాసిగూడ(Warasiguda)లోని బీవీకే రెడ్డి హాస్పిటల్(BVK Reddy Hospital)లో పెద్ద ఎత్తున మందుల అక్రమ నిల్వలు బయటపడ్డాయి.
ఆసుపత్రి యాజమాన్యాలు ఎటువంటి అనుమతి లేకుండా పలు రకాల మందులను నిల్వ చేసి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ జాయింట్ ఆపరేషన్ లో ఫెంటానిల్(Fentanyl), కెటామైన్(Ketamine), మిడాజోలం ఇంజెక్షన్ల(Midazolam Injections)తో పాటు నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాల భారీ నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చార్మినార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, ముషీరాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లలో ఎన్డీపీఎస్ చట్టం(NDPS Act) కింద కేసులు నమోదు చేశారు. ఇందులో తదుపరి విచారణ జరిపి నేరస్తులందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీ డీసీఏ వీబీ కమలాసన్ రెడ్డి తెలిపారు.