- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aghori Mata: ‘నన్ను ఉరి తీయండి’.. మహిళా అఘోరి సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో పర్యటిస్తున్న మహిళా అఘోరి (Female Aghori) సంచలనం సృష్టిస్తోంది. అయితే తెలంగాణ(Telangana)లో పలు ఆలయాలను సందర్శించిన మహిళ అఘోరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని పలు ఆలయాలను సందర్శిస్తుంది. శ్రీకాళహస్తిలో మహాశివుడిని తను దర్శించుకునే ప్రయత్నం చేయగా ఆలయ అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె వారితో వాదనకు దిగడం, ఆత్మార్పణ చేయడం వివాదాస్పదమైంది. చివరకు నాగశక్తి పీఠాధిపతి సూచనతో వస్త్రాన్ని కప్పుకుని దర్శనం ప్రక్రియ పూర్తి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) అఘోరి మాత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఇబ్బందులు పెట్టడం వల్ల నా కారు యాక్సిడెంట్ అయిందని పేర్కొన్నారు. ‘పోలీసులు ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండి. చంపేయండి లేదా ఉరిశిక్ష వేస్తే పీడ పోతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కారు ఎప్పుడు నా చేతికి వస్తుందో తెలియదు. కారు రిపేర్ అయ్యేంతవరకు పాదయాత్ర చేస్తూనే ఉంటాను. ప్రస్తుతం యాగంటికి వెళ్తున్నాను. ఆ తర్వాత మహానంది శ్రీశైలం వెళ్లి పూజలు చేస్తాను’ అని అఘోరి మాత తెలిపారు.