Bihar : ఛత్ పూజలో ఘోర ప్రమాదం

by M.Rajitha |   ( Updated:2024-11-09 12:04:19.0  )
Bihar : ఛత్ పూజలో ఘోర ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్(Chath) పూజ కోసం చెరువులోకి వెళ్ళిన యువకులు దుర్మరణం పాలయ్యారు. బీహార్(Bihar)లోని చాప్రా జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం ఛత్ పూజ కోసం చివరి రోజు కావడంతో కొందరు యువకులు చెరువులోకి పడవలో వెళ్లారు. అయితే ఎక్కువ మంది యువకులు ఉండటంతో ఆ పడవ బోల్తా పడింది. ఇద్దరు యువకులు ఆ చెరువులో మునిగి మరణించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు. మృతులు పంచబింద గ్రామానికి చెందిన 20 ఏళ్ల బిట్టు కుమార్, 18 ఏళ్ల సూరజ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. గల్లంతైన మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. ఈ సమాచారం తెలిసిన తర్వాత చాలా ఆలస్యంగా పోలీసులు, అంబులెన్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడంపై గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి చెందిన సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Next Story