Honeytrap Case: హనీట్రాప్ లేడీ జెమీమాపై మరో కేసు.. తనను నిర్బంధించి అలా చేశారన్న బాధితుడు

by Rani Yarlagadda |   ( Updated:2024-11-08 12:32:29.0  )
Honeytrap Case: హనీట్రాప్ లేడీ జెమీమాపై మరో కేసు.. తనను నిర్బంధించి అలా చేశారన్న బాధితుడు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో (Vizag Honeytrap Case).. ప్రధాన నిందితురాలైన జెమీమాపై మరో కేసు నమోదైంది. తనను నిర్బంధించి.. చంపేందుకు యత్నించారని ఓ బాధితుడు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో (MVP Police Station) ఫిర్యాదు చేయగా.. ఆమెపై పోలీసులు మరో కేసు ఫైల్ చేశారు. హనీట్రాప్ కిలేడీ జెమీమా (Honeytrap Jameema).. వేణురెడ్డితో కలిసి డెబిట్ కార్డు నుంచి లక్షలు కాజేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా.. జెమీమాపై ఇప్పటి వరకూ 4 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అబ్బాయిలను ట్రాప్ చేసి.. వారితో సన్నిహితంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను చూపించి.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆన్లైన్లో పెడతామని బెదిరింపులకు పాల్పడింది జెమీమా ముఠా. గత నెలలో వెలుగు చూసిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి దారితీసిన సంగతి తెలిసిందే. జెమీమా అరెస్ట్ తర్వాత.. ఆమెను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వివిధ అంశాలపై విచారించారు. ఆమె నుంచి ల్యాప్ టాప్స్, మొబైల్స్ స్వాధీనం చేసుకుని, వాటిని ఓపెన్ చేయించి.. వాటిలో ఉన్న సమాచారాన్ని సేకరించారు.

Advertisement

Next Story