రోడ్డు ప్రమాదంలో అంగన్వాడీ టీచర్ స్పాట్ డెడ్

by Satheesh |
రోడ్డు ప్రమాదంలో అంగన్వాడీ టీచర్ స్పాట్ డెడ్
X

దిశ, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ అంగన్వాడీ టీచర్ మృతి చెందింది. వివరాల ప్రకారం.. మెట్‌పల్లి మండలం సత్తక్కపల్లి గ్రామానికి చెందిన కొడిమ్యాల వసుంధర(45) అనే అంగన్వాడీ టీచర్ తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు ఢిల్లీలో చేపట్టే ధర్నాకు వెళ్లేందుకు సోమవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో ఇంటి నుండి కుమారునితో కలిసి ద్విచక్రవాహనంపై మెట్ పల్లికి బయల్దేరింది.

ఈ క్రమంలో మేడిపల్లి వద్ద జాతీయ రహదారిపై అప్పటికే చనిపోయి ఉన్న గేదే మృతదేహాంపైకి వీరిద్దరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం దూసుకుపోవడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో వసుంధర అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమారునికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. ఆమె మృతదేహాన్ని మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వసుంధరకు భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా, వసుంధర మృతితో సత్తక్కపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story