- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JNTU : జేఎన్టీయూలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు సీట్ల కేటాయింపు..
దిశ, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జేఎన్టీయూతో సింగరేణి యాజమాన్యం చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి బ్రాంచ్ లో మూడు సీట్లతో ఎగ్జిక్యూటివ్స్ కోటా కింద ఆరు బ్రాంచ్ ల్లో 18, కార్మికులకు 18 సీట్లు మొత్తంగా 36 సీట్లను కేటాయించారు. ఎంసెట్ లో అర్హులైన విద్యార్థిని విద్యార్థులకు జేఎన్టీయూ ప్రిన్సిపాల్ చెరుకు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ప్రారంభించారు.
ఈ సీట్ల కోసం 29 మంది కార్మికుల పిల్లలు, 7గురు అధికారుల పిల్లలు దరఖాస్తులు సమర్పించారు. ఇందులో ముగ్గురు అధికారుల పిల్లలు, పన్నెండు మంది కార్మికుల పిల్లలు కౌన్సిలింగ్ కు హాజరవ్వగా 11 మందికి సీట్లను కేటాయించారు. 5 సీఎస్ఈ, 4 సీఎస్ఎం, 1 మైనింగ్, 1 ఈఈఈ సీట్లను విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కృష్ణ మోహన్, సింగరేణి హెచ్ఆర్డీ జీఎం కృష్ణయ్య, కార్పోరేట్ పర్సనల్ డీజీఎం విలాస్ శ్రీనివాస్ పోద్దార్, ఆర్జీ 3 పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డి, హెచ్ఆర్డీ డీజీఎం జాఫర్, శ్రీకాంత్, కళాశాల ఆఫీస్ సూపరింటెండెంట్ రవికుమార్ పాల్గొన్నారు.