విజయదశమి నుండి అన్ని విజయాలు చేకూరాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

by Aamani |
విజయదశమి నుండి అన్ని విజయాలు చేకూరాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : విజయదశమి నుంచి అన్ని విజయాలు చేకూరాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. విజయదశమి సందర్భంగా శనివారం ఆయన జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించి, జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు, సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు.

సమాజంలో చెడును పారదోలేందుకు పోలీస్ విభాగం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో నేరాల నియంత్రించడంలో జిల్లా పోలీస్ శాఖ ముందంజలో ఉండాలని, దుర్గ మాత కరుణాకటాక్షాలు జిల్లా పోలీసులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐ లు మధుకర్, యాదగిరి, రమేష్, సీఐ లు కృష్ణ, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed