Collector : టాస్క్ భవనం ఆధునీకరణ పెండింగ్ పనులు పూర్తి చేయాలి..

by Sumithra |
Collector : టాస్క్ భవనం ఆధునీకరణ పెండింగ్ పనులు పూర్తి చేయాలి..
X

దిశ, పెద్దపల్లి : టాస్క్ భవనం ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలోని టాస్క్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించి టాస్క్ భవనం ఆధునీకరణ పనులను తనిఖీ చేశారు. పెద్దపల్లి టాస్క్ భవన ఆధునీకరణ పనులను ఆసాంతం పరిశీలించిన కలెక్టర్, పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టాస్క్ భవనంలో పూర్తి చేసిన ఫ్లోరింగ్, మెట్లకు వుడెన్ టైల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రి సమయం తీసుకుని టాస్క్ భవనాన్ని ప్రారంభిస్తారని, దీనికి వీలుగా పెండింగ్ పనులను 5 రోజులలోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. టాస్క్ కేంద్రంలో ల్యాబ్, క్లాస్ రూమ్ ఏర్పాటుకు అవసరమైన ఫర్నిచర్ సిద్దం చేయాలని, త్వరగా ల్యాబ్ , క్లాస్ రూమ్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టాస్క్ మేనేజర్ కు సూచించారు. అనంతరం పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారం పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనీఖీలో జిల్లా కలెక్టర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్, పీఆర్ డి.ఈ.శంకరయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story