పెద్దూర్ గురుకులలో ఏసీబీ తనిఖీలు..

by Nagam Mallesh |
పెద్దూర్ గురుకులలో ఏసీబీ తనిఖీలు..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధిః పట్టణంలోని పెద్దూర్ గురుకుల పాఠశాలను మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. ర్యాండం సిస్టంలో భాగంగా ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల పట్టణం పెద్దూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో డీఎస్పీ ఉదయ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయని అధ్యయనం చేసి, నివేదికను రాష్ట్ర డీజీ కి సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story