ప్రజల అండతోనే ఏడాది పాలన పూర్తి

by Sridhar Babu |
ప్రజల అండతోనే ఏడాది పాలన పూర్తి
X

దిశ, గోదావరిఖని టౌన్ : రామగుండం నియోజకవర్గ ప్రజల అండదండలతోనే అభివృద్ధి బాటలో ఏడాది పాలన కొనసాగిందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. మంగళవారం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజలు, నాయకులు ఏడాది పాలనపై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా నేరుగా క్యాంపు కార్యాలయానికి వచ్చి కలవచ్చని పిలుపునిచ్చారు.

ప్రజాపాలన కొనసాగించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ను అభినందించి శాలువాతో ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాతపల్లి ఎల్లయ్య ధనుంజయ్, ధూళికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed