ప్రజావాణికి కత్తితో మహిళ..?

by Shiva |   ( Updated:2023-03-27 11:53:53.0  )
ప్రజావాణికి కత్తితో మహిళ..?
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: ప్రజావాణిలో కలకలం రేగింది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో మాములుగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాధితులు దరఖాస్తులు ఇవ్వడానికి రావడం సర్వసాధారణం. ఇక్కడ మాత్రం ఓ మహిళ కత్తితో రావడం సంచలనంగా మారింది. అయితే, పోలీసులు ముందుగానే గమనించి సదరు మహిళను అక్కడ నుంచి వెళ్లిపొమ్మని చెప్పినట్లు సమాచారం. సదరు మహిళ ప్రజావాణికి ఎందు కోసం వచ్చింది ఒకవేళ దరఖాస్తు ఇవ్వడానికి వస్తే.. తన వెంట కత్తి ఎందుకు తీసుకొచ్చిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed