మద్యం బాటిళ్లతో వెళ్తున్న వ్యాన్ బోల్తా

by Mahesh |
మద్యం బాటిళ్లతో వెళ్తున్న వ్యాన్ బోల్తా
X

దిశ, కోరుట్ల : మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్న ఐచర్ వ్యాన్ బోల్తా పడిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి కోరుట్ల పట్టణంలోని సాయిబాబా ఆలయం సమీపంలో చోటు చేసుకుంది. కరీంనగర్ లోని ఐఎల్ డిపో నుంచి మద్యం బాటిళ్లను లోడ్ చేసుకొని కరీంనగర్ నుండి మెట్‌పల్లికి మద్యం (లిక్కర్) తరలిస్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న డ్రైవర్ నారాయణ, క్లినర్ శ్రీకాంత్‌లు స్వల్ప గాయలతో బయటపడ్డారు. వ్యాన్ బోల్తా పడటంతో మద్యం బాటిల్లు చెల్లాచెదరుగా పడిపోయాయి, కొన్ని పగిలిపోయాయి.

Advertisement

Next Story