నీటి సంపులో పడి మూడేండ్ల బాలుడు మృతి.. తల్లికి హార్ట్ స్ట్రోక్

by Mahesh |
నీటి సంపులో పడి మూడేండ్ల బాలుడు మృతి.. తల్లికి హార్ట్ స్ట్రోక్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ ఆమ్లెట్ విలేజ్ అయిన గాజులపల్లి కి చెందిన పెద్దోళ్ల కిషన్ యాదవ్-అనూష కుమారుడు శ్వేహన్(3) ఆదివారం సాయంత్రం తమ ఇంటి ముందు ఉన్న సంపు పక్కన ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో తన చేతిలో ఉన్న పలుక ఓపెన్ సంపులో పడిపోయింది. పలుకను తీసేందుకు శ్వేహన్ ప్రయత్నం చేస్తుండగా అందులోనే జారి పడి చనిపోయాడు. తమ కుమారుడు కనిపించడం లేదని తల్లి అనూష వెతుకుతుండగా సంపులో శ్వేహన్ దేహం పైకి తేలింది.

ఒక్కసారిగా ఆ తల్లి గుండెలు పగిలేలా అరుస్తూ ఏడ్చింది. దీంతో ఆవుల షేడ్డులో ఉన్న తండ్రితో పాటు పలువురు వచ్చి వెంటనే శ్వేహన్‌ను సిరిసిల్లలోని ప్రభుత్వ హస్పిటల్ కు తరలించారు. అక్కడ డాక్టర్ పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు విగత జీవిగా కనిపించేసరికి ఆ తల్లి గుండె తట్టుకోలేక అనూషకు గుండెనొప్పి వచ్చింది. తనను సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ హస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మూడేళ్ల శ్వేహన్ మృతితో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed