- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుర్వాసన వెదజల్లుతున్న చికెన్ సెంటర్.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు..
దిశ, ముస్తాబాద్ : మండల కేంద్రంలోని చికెన్ సెంటర్ నిర్వాహకుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న చికెన్ సెంటర్ల యజమానుల పోకడలు మితి మీరి పోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రోడ్డుని ఆనుకొని కనకదుర్గ చికెన్ సెంటర్ ను నూతనంగా ప్రారంభించి చికెన్ ని విక్రయిస్తున్నారు.
అయితే ఈ కోల్లను మూడురోజులకు ఒకసారి దిగుమతులు చేసుకోకుండా దుకాణంలొనే కోళ్లను పెంచడం విడ్డురంగా మారింది. కోళ్లు విడుదల చేసే వ్యర్థాల వలన దుకాణం ముందు నుండి వచ్చే పోయే వాళ్ళకి, పక్కన దుకాణ దారులకు ముక్కు పుటలు అదిరేలా దుర్వాసన వెదజల్లుతుందని చెబుతున్నారు. పలుమార్లు పక్కనున్న దుకాణ దారులు ఈఓ కి విన్నవించినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఈఓ రాజు ని 'దిశ ' వివరణ కోరగా ఇప్పటి వరకు ఎవరు సదరు చికెన్ సెంటర్ పై కంప్లైంట్ చేయలేదని అన్నారు.