- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిస్మిస్ అయిన ఉద్యోగులకు సువర్ణ అవకాశం
దిశ,రామగిరి: సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తూ గత మూడు సంవత్సరాలలో అనగా తేది: 01-01-2019 నుండి తేదీ: 31-12-2022 వరకు గల గైర్హాజరు కారణంగా డిస్మిస్ అయిన మాజీ ఉద్యోగులను తిరిగి ఉద్యోగ నియామాకం కలదు. దాని కోసం సింగరేణి యాజమాన్యం తెలిపిన నియమ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారిని హై పవర్ కమిటీ చే నిర్వహించబడే రివ్యూ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆర్జీ-3 జీఎం ఎన్. సుధాకర రావు, ఏ. పి. ఏ జీ ఎం కే. వెంకటేశ్వర్లు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్జీ-3 & ఏ.పి.ఏ ఏరియాలో తేదీ: 01-01-2019 నుండి తేది : 31-12-2022 వరకు గల గైర్హాజరు కారణంగా డిస్మిస్ కాబడిన మాజీ ఉద్యోగులు తేదీ 01-04-2023 నాటికి 46 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయస్సు కలిగి, డిస్మిస్ అయిన కాలానికి ముందు 05 సంవత్సరాలలో ఏదైనా 02 సంవత్సరాలలో కనీసం 100 మస్టర్లు కలిగి యుండి, బదిలీ వర్కర్( అండర్ గ్రౌండ్), కేటగిరి -1 గా తిరిగి నియామకం కోసం తగిన మెడికల్ ఫిట్ నెస్ కలిగి ఉండాలి తెలియజేశారు.కావున గైర్హాజరు కారణం తో తొలగించబడిన అర్హత గల ఉద్యోగులు బదిలీ వర్కర్( అండర్ గ్రౌండ్), కేటగిరి - 1 గా మళ్లీ నియామకం కోసం తమ దరఖాస్తులను సంబధిత గని/విభాగం కార్యాలయంలో తేదీ:31-10-2023 లోగా అందజేయాలని తెలియజేశారు.