- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భద్రాద్రి రాముని దర్శనానికి 700 కి.మీ పాదయాత్ర..
దిశ, వెల్గటూర్ : భద్రాచలంలో ఉన్న శ్రీసీతా రామచంద్ర స్వామి వారి దర్శనానికి ఓ మరాఠీ కుటుంబం ఏకంగా 700 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తూ సాగిపోతున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పుసత్ గ్రామానికి చెందిన విజయ్ అనే యువకుడు తన కుటుంబంతో కలిసి భద్రాద్రి రాముడు దర్శనానికి ఇంటి నుంచి గత 13 రోజుల క్రితం కాలినడకన బయలుదేరారు. ఆంజనేయ స్వామి జెండా చేత పట్టుకొని తల్లిదండ్రులు భార్యతో కలిసి నాందేడ్ జిల్లా పుసత్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా భద్రాచలానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఉన్న జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలానికి గురువారం చేరుకున్నారు. మిట్ట మధ్యాహ్నం పూట ఎండ వేడిమికి రాష్ట్ర రహదారి వెంట నడిచి వెళ్తున్నారు.
ఈ దృశ్యం దిశ కంటపడటంతో వారితో కలిసి మాట్లాడగా విజయ్ అనే యువకుడు వారి పాదయాత్ర విశేషాలను వెల్లడించారు. ఇంకా 200 కిలోమీటర్ల దూరం పాదయాత్ర బాకీ ఉందని, మరో మూడు రోజుల్లో తాము భద్రాచలం చేరుకొని శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని దర్శించుకుంటామని సంతోషం వ్యక్తం చేశారు. తమ కష్టాలు కడతేర్చాలని శ్రీరాముని వేడుకుంటూ పాదయాత్ర చేపట్టామని మరాఠీ కుటుంబం చెప్పటం విశేషం. మండుతున్న ఎండల్లో ఏమాత్రం అలసిపోకుండా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాద్రి రాముడు కోసం పాదయాత్ర చేస్తున్న కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని వెల్లటూరు వాసులు ఆకాంక్షించారు.