మిసెస్ ఇండియా కిరీటం దక్కించుకున్న కరీంనగర్ బిడ్డా

by GSrikanth |
మిసెస్ ఇండియా కిరీటం దక్కించుకున్న కరీంనగర్ బిడ్డా
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మిసెస్ ఇండియా కిరీటాన్ని హైదరాబాద్‌కు చెందిన అంకిత ఠాకూర్​గెలుచుకుంది. కేరళ రాష్ర్టం కొచ్చిలో మంగళవారం జరిగిన ఫైనల్స్‌లో పద్నాలుగు రాష్ర్టాలకు చెందిన అమ్మాయిలను వెనక్కి నెట్టి అంకిత ఈ టైటిల్​సాధించటం విశేషం. గోదావరిఖనికి చెందిన అంకిత ఠాకూర్​కుటుంబం కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్​వచ్చి స్థిరపడింది. రష్మిక ఠాకూర్​నుంచి శిక్షణ తీసుకుని ఫైనల్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మిసెస్​ఇండియా కిరీటాన్ని సాధించటంపై ఎలా స్పందిస్తారు? అని అడిగితే ఈ క్షణాలను జీవితంలో మరిచిపోలేనని అంకిత ఠాకూర్​అన్నారు. 1997లో హైదరాబాద్‌కే చెందిన డయానా హెడెన్​మిస్​వరల్డ్‌గా నిలిచి మన నగరానికి పేరు తీసుకురాగా ప్రస్తుతం దేశస్థాయిలో మిసెస్​ఇండియా కిరీటాన్ని సాధించి అంకిత ఠాకూర్​అదే ఘనతను సాధించి పెట్టింది.

Advertisement

Next Story