కంటి వెలుగు పథకం దేశంలోనే గొప్ప కార్యక్రమం: స్పీకర్ పోచారం

by Satheesh |   ( Updated:2023-02-08 14:44:31.0  )
కంటి వెలుగు పథకం దేశంలోనే గొప్ప కార్యక్రమం: స్పీకర్ పోచారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కంటి వెలుగు పథకం పేదలకు వరం లాంటిదని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్‌లో ఏర్పాటు చేసిన కంటివెలుగు ప్రత్యేక శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. కంటివెలుగు పథకం దేశంలోనే గొప్ప కార్యక్రమం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా కంటి వెలుగు పథకాన్ని ఆయా రాష్ట్రాలలో అమలు చేయాలని ఆలోచిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తన్నీరు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు.

వైద్యపరీక్షలు చేసుకున్న ఎంఐఎం

అసెంబ్లీ లాంచ్‌లో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని ఎంఐఎం ఎమ్మెల్యేలు సందర్శించారు. ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, పాషా ఖాద్రి, ముంతాజ్ ఖాన్‌లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి వైద్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కంటివెలుగు అద్భుతంగా ఉందన్నారు. పేదలకు ఎంతో లబ్ది జరుగుతుందన్నారు.

Also Read..

కౌలు రైతు పంట ధ్వంసం.. రైతును ఆదుకున్న ఎంపీ

Advertisement

Next Story

Most Viewed